TDP - Manifesto............ Vote for Cycle

పేదింట ఆడపిల్లల వివాహానికి సాయం అందించే ఉద్దేశంతో చంద్రన్న పెళ్ళికానుక పథకం ద్వారా బీసీల వివాహానికి రూ.35 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, గిరి పుత్రికా కల్యాణ పథకం పేరుతో ఎస్టీలకు రూ.50 వేలు, దుల్హన్ పేరుతో మైనారిటీలకు రూ.50 వేల ఆర్థిక సహకారాన్ని అందిస్తూ వచ్చింది తెలుగుదేశం. అలా ఇప్పటివరకు 84,897 వివాహాలకు రూ.342.97 కోట్లను ఇచ్చింది. ఇకపై అన్నివర్గాలలోని పేదింటి ఆడపిల్లల వివాహానికి లక్ష రూపాయలు ఇస్తామని తెలుగుదేశం తన మేనిఫెస్టో-2019లో హామీ ఇచ్చింది. 

#TDPManifesto2019 
#VoteForCycle

TDP - Manifesto

గత ఐదేళ్ళలో మహిళా సంఘాలలోని దాదాపు కోటి మంది డ్వాక్రా మహిళలకు రూ.68,380 కోట్ల బ్యాంకు రుణాలు, రూ.21,118 కోట్ల పసుపు కుంకుమ, రూ.4455 కోట్ల స్త్రీనిధి రుణాలు, రూ.880 కోట్ల ఉన్నతి రుణాలు, రూ.2,514 కోట్ల వడ్డీ రాయితీ... ఇవన్నీ కలిపి మొత్తం రూ.97,347 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. అంటే దాదాపు లక్ష కోట్లన్న మాట. మళ్ళీ అధికారంలోకి వస్తే రానున్న ఐదేళ్ళలో రూ.లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని డ్వాక్రా మహిళలకు అందిస్తామని తన మేనిఫెస్టోలో చెబుతోంది తెలుగుదేశం. అంతేకాదు పసుపుకుంకుమను ప్రతి ఏడాదీ ఇస్తామని, డ్వాక్రా మహిళలందరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇస్తామని హామీ ఇచ్చింది.

#TDPManifesto2019 
#VoteForCycle